![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-343 లో.. కావ్య వేసిన డిజైన్స్ బాగున్నా కూడా రాజ్ బాలేవని చెప్తాడు. ఆ తర్వాత కావ్య కావాలనే ఒకవేళ మా బావ జాబ్ మానెయ్యమంటే జాబ్ మానేస్తానని కావ్య అంటుంది. దాంతో రాజ్ కి ఇంక కోపం వస్తుంది. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకున్న వీడియో న్యూస్ లో రావడం చూసిన ప్రకాష్, సుభాష్ లకి చూపిస్తాడు.
.webp)
ఆ తర్వాత ఆ వీడియోలో ఇందిరాదేవి, సీతారామయ్యలని చూసి వీళ్ళు కూడా ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారా అని సుభాష్, ప్రసాద్ అనుకుంటారు. మనమేమి తక్కువనా.. మన భార్యలకి కూడా విషెస్ చెపుదామని సుభాష్ అంటాడు. దానికి సరేనని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత సుభాష్ రెడ్ రోజ్ పట్టుకొని హాల్లోకి వెళ్లి అపర్ణని గదిలోకి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత ప్రకాష్ వచ్చి ధాన్యలక్ష్మిని గదిలోకి రమ్మని పిలుస్తాడు. అపర్ణకి సుభాష్ ఐ లవ్ యు అని చెప్పగానే అపర్ణ సిగ్గుపడుతుంది. మరొకవైపు ధాన్యలక్ష్మిని గదిలోకి పిలిచిన ప్రకాష్.. అసలు విషయం మర్చిపోతాడు. కాసేపటికి గుర్తుకు చేసుకొని ఐ లవ్ యు అని చెప్తాడు. దాంతో ధాన్యలక్ష్మి సిగ్గుపడుతు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి శృతి వచ్చి.. క్లయింట్ వచ్చాడు సర్ అని చెప్తుంది. ఇప్పుడేం చేయాలి ఆ డిజైన్స్ బాలేవు.. వాళ్ళు ఖచ్చితంగా ఆ డీల్ క్యాన్సిల్ చెయ్యడానికి వచ్చారని రాజ్ అంటాడు. అపుడే వాళ్ళు రాజ్ దగ్గరకి వస్తారు. మీకు డిజైన్స్ నచ్చలేదని నాకు అర్ధం అయింది. నేను మళ్లీ కొత్త డిజైన్స్ చేసి పంపిస్తానని రాజ్ అనగానే.. డిజైన్స్ చాలా బాగున్నాయి. కావ్యగారు వేసిన డిజైన్స్ నచ్చాయని వాళ్ళు అనగానే రాజ్ మొహం వాడిపోతుంది. వాళ్ళు వెళ్ళాక డిజైన్స్ చూసి ఇవి ఎలా నచ్చాయో అంటూ రాజ్ కావాలనే అంటాడు.
.webp)
ఆ తర్వాత రాహుల్ దగ్గరికి స్వప్న వచ్చి వాలైంటైన్ డే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తుంది. నీ అంత సిన్సియర్ గా నేను ప్రేమించలేదని రాహుల్ అంటాడు.. ఆ తర్వాత కళ్యాణ్ ఎంప్లాయిస్ కి కవితలు వినిపిస్తుంటే.. అప్పుడే అనామిక వచ్చి నువ్వు ఆఫీస్ లో వచ్చి చేస్తుంది ఇదా అని అందరి ముందు కళ్యాణ్ తిడుతుంటే.. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడమని అనామికకి రాజ్ చెప్తాడు. అనామిక ఇంటికి వెళ్లి అందరిని హాల్లోకి పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |